Page Loader
Rahul Gandhi: 'ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారు?': అరవింద్ కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ విమర్శలు 
అరవింద్ కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ విమర్శలు

Rahul Gandhi: 'ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారు?': అరవింద్ కేజ్రీవాల్ పై రాహుల్ గాంధీ విమర్శలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న సమయంలో,లోక్‌సభ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు), కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా, రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్టు పెట్టారు. ఆయన ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వాములై ఓటు వేసేందుకు ప్రజలను ప్రోత్సహించారు.

వివరాలు 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ పై రాహుల్‌గాంధీ

స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడే సందర్భంలో, ఢిల్లీలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారో ఢిల్లీ ప్రజలు ఓటు వేసేటప్పుడు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాహుల్‌గాంధీ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ గురించి ఈ వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ హక్కులను తిరిగి పొందుతారని, రాజ్యాంగం బలోపేతమై ఢిల్లీ మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తుందని ఆయన తెలిపారు. అలాగే, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఈ రోజు ఉదయం రాహుల్‌గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వివరాలు 

ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిన వారిని ప్రజలు గుర్తుంచుకోవాలి 

'నా ప్రియమైన ఢిల్లీ సోదర సోదరీమణులారా..' అని రాహుల్‌గాంధీ తన సోషల్ మీడియా పోస్టును ప్రారంభించారు. ఢిల్లీలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓటు వేసేటప్పుడు ఢిల్లీ నగరంలో ఉన్న కాలుష్యం, మురికి నీరు, చెడిపోయిన రోడ్లకు ఎవరు బాధ్యులనో గుర్తుంచుకోవాలని సూచించారు. అలాగే, స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడే సమయంలో ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిన వారిని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. తన ఓటు వృథా చేసుకోకుండా పని చేయని వారిని మళ్లీ మళ్లీ గెలిపించవద్దని ఆయన పిలుపునిచ్చారు.

వివరాలు 

వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు

ఈ రోజు ఢిల్లీలో 13,766 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి హ్యాట్రిక్ సాధించాలని ఆశతో ఉంది. తమ పాలనా రికార్డు, సంక్షేమ పథకాల ఆధారంగా మూడవసారి అధికారంలోకి రావాలని ఈ పార్టీ భావిస్తోంది. మరోవైపు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించి, అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడయ్యే అవకాశం ఉంది.