
Bihar Elections: 243 సీట్లలో పోటీ.. రాహుల్ గాంధీకి షాకిచ్చిన తేజస్వీ యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, ఆర్జేడీ (RJD) నేతృత్వంలోని మహాఘటబంధన్ కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీట్ల పంపకాల్లో ప్రతిష్టంభన నెలకొంది. రాబోయే ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ 243 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తానని ముజఫర్‌పూర్‌లోని కాంతి భవన్‌లో జరిగిన కార్యకర్తల ర్యాలీలో ప్రకటించారు. ఇటీవల రాహుల్ గాంధీతో కలిసి బీహార్ వ్యాప్తంగా నిర్వహించిన 'ఓటర్ అధికార్ ర్యాలీ'లో ఇద్దరు పార్టీలు కలిసి సీట్లు పంచుకుంటారని అందరూ భావించారు. అయితే సీట్ల పంపకంలో రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది
Details
కాంగ్రెస్‌పై ఒత్తిడి
తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ మేము తిరిగి అధికారంలోకి వస్తామని, . బీహార్‌లో 243 సీట్లలో పోటీ చేస్తామని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. ఇటీవల, బీహార్ సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా దాటారు. తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమని భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ మధ్య సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఎక్కువ సీట్లను కోరుతున్నదని, ఆర్జేడీ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.