LOADING...
vote chori: కాంగ్రెస్'వోటు చోరీ' ఆరోపణలపై.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన జడ్జీలు, మాజీ సైనికులు సహా 272 మంది..
రాహుల్ గాంధీకి లేఖ రాసిన జడ్జీలు, మాజీ సైనికులు సహా 272 మంది..

vote chori: కాంగ్రెస్'వోటు చోరీ' ఆరోపణలపై.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన జడ్జీలు, మాజీ సైనికులు సహా 272 మంది..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా 272 మంది ప్రముఖులు కలిసి ఎన్నికల సంఘానికి తమ మద్దతును ప్రకటిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో 16 మంది మాజీ న్యాయమూర్తులు, 123 మంది పదవీ విరమణ చేసిన అధికారులు, 14 మంది మాజీ రాయబారులు, 133 మంది రిటైర్డ్ సైనిక అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష నాయకులు ఈసీపై చేస్తున్న ఆధారరహిత ఆరోపణలను వారు ఖండించారు. ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, రాహుల్ గాంధీ నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు.

వివరాలు 

కాంగ్రెస్ వాదన ఎక్కడా రుజువు కాలేదు 

భారత ప్రజాస్వామ్యానికి బాహ్య ముప్పు ఏమీ లేదని, అసలు ప్రమాదం విషపూరిత రాజకీయ వ్యాఖ్యల నుంచే వస్తోందని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈసీ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్ వాదన ఎక్కడా రుజువు కాలేదని వారు గుర్తుచేశారు. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు, అఫిడవిట్, లేదా సరైన న్యాయ ప్రక్రియ ద్వారా ఆధారాలు సమర్పించలేదని సూచించారు. ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహాలు మాత్రమేనని, నిజానిజాలతో సంబంధం లేదని ప్రస్తావించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా ఆ లేఖ ఉటంకించింది. ఆయన "ఓటు చోరీ" అంటూ ఆరోపించడంతో పాటు "అణుబాంబు పేలబోతోంది" అని చెప్పిన విషయాన్ని నిపుణులు సీరియస్‌గా తీసుకున్నారు.

వివరాలు 

ఈసీ 'బీజేపీ B-టీమ్'

ఈ తరహా మాటలు ఎన్నికల కమిషన్‌లో పని చేసే అధికారులను బెదిరించేందుకు చేసిన ప్రయత్నంలా కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. లేఖలోని నిపుణుల మాటల్లో.. EC SIR మొత్తం ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించింది, కోర్టు పర్యవేక్షణలో ధృవీకరణ చేపట్టింది, తప్పుడు ఓటర్లను తొలగించింది, అర్హత ఉన్న కొత్త ఓటర్లను జాబితాలో చేర్చింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈసీని 'బీజేపీ B-టీమ్'గా అభివర్ణించడం పూర్తిగా రాజకీయ హంగామా మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ప్రతిపక్షానికి అనుకూల ఫలితాలు వస్తే ఈసీపై విమర్శలు కనిపించవని, ఫలితాలు అనుకూలంగా రాకపోతే మాత్రం కమిషన్‌ను దోషిగా నిలబెడతారని, ఇది రాజకీయ అవకాశవాదాన్ని బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఈసీపై ఆరోపణలకు విదేశీ వేదికలను ఉపయోగించిన రాహుల్ గాంధీ

ఈసీపై ఆరోపణలకు విదేశీ వేదికలను ఉపయోగించిన రాహుల్ గాంధీ లేఖలో మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాహుల్ గాంధీ దేశీయ వేదికలతో పాటు విదేశాల్లో కూడా భారత ఎన్నికల వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రయత్నించారని.. అమెరికా పర్యటన సమయంలో బోస్టన్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా చూపించారు. ఎన్నికల సంఘం రాజీ పడిందని, వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని తమకు స్పష్టంగా తెలుసని. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేశారని ఈసీ తనకే చెప్పిందని, ఇది భౌతికంగా అసాధ్యమని అన్నారు.

వివరాలు 

ఒక్కో ఓటరు ఓటు వేయడానికి కనీసం మూడు నిమిషాలు

ఒక్కో ఓటరు ఓటు వేయడానికి కనీసం మూడు నిమిషాలు పడుతుందని, అలాంటి పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో ఎలా ఓటింగ్ జరిగిందో ప్రశ్నించారు. వీడియోలను చూపించమని అడిగితే ఈసీ నిరాకరించిందని, దీని తరువాత అలా అడగడానికి వీలు లేకుండా చట్టాన్ని మార్చేశారని ఆయన ఆరోపించారు. బీహార్ ఎన్నికలకు ముందు కూడా రాహుల్ గాంధీ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు లేఖ గుర్తు చేసింది.