Rahul Gandhi: బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నాయి: రాహుల్ గాంధీ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు.
దేశ రాజ్యాంగాన్ని మార్చే రోజు దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు ఏ ప్రయోజనమూ ఉండదని ఆయన హెచ్చరించారు.
స్వాతంత్య్రానికి ముందు దేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేవని, ఆ హక్కులు కేవలం ధనికులకే పరిమితమై ఉన్నాయని గుర్తుచేశారు.
ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా పేదలను, దళితులను, గిరిజనులను బానిసలుగా మార్చే కుట్రలు చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.
Details
రాజ్యంగా భారతీయుల ఆలోచలనకు ప్రతిబింబం
భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి పేదల హక్కులను తొలగించడమే వారి లక్ష్యమని చెప్పారు.
భారతదేశంలో రాజ్యాంగాన్ని నమ్మే కాంగ్రెస్ పార్టీ ఒక వైపు ఉంటే, రాజ్యాంగాన్ని వ్యతిరేకించే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరోవైపు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం పుస్తకమాత్రమే కాదని, ఇది భారతీయ ఆలోచనల ప్రతిబింబమని రాహుల్ గాంధీ తెలిపారు.
మహాత్మా గాంధీ, అంబేద్కర్, బుద్ధుడు, పూలే వంటి మహనీయుల ఆలోచనలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయని వివరించారు.
గతంలో బీజేపీ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పిందని, అయితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల శ్రమతో వారి ప్రయత్నాలను అడ్డుకున్నామని రాహుల్ తెలిపారు.
Details
రాజ్యంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలసి పేదలు నిశ్శబ్దంగా ఉండాలని, ఆకలితో చనిపోవాలని భావిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.
భారతదేశాన్ని అంబానీ, అదానీల వంటి ధనికులు మాత్రమే నడపాలనే వారు ఆశిస్తున్నారని అన్నారు.
రాజ్యాంగం కారణంగానే మోదీ ప్రజల ముందు తలవంచాల్సి వచ్చిందని, అది కాంగ్రెస్ కృషి ఫలితమని అన్నారు.
ఈ ర్యాలీతో కాంగ్రెస్ తన రాజ్యాంగ పరిరక్షణపై కట్టుబాటును మరోసారి ప్రదర్శించగా, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది.