Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా భారీ లాభాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతుతో ప్రధాన సూచీలు లాభాలను నమోదు చేశాయి. రోజువారీ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 599.90 పాయింట్లు లేదా 0.81 శాతం లాభపడింది. దీంతో 74,894.86 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 82.60 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 23,429.00 వద్ద నిలిచింది. ఇక సోమవారం ట్రేడింగ్‌లో పలు కంపెనీల షేర్లు గణనీయమైన లాభాలను నమోదు చేసి టాప్ గెయినర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
వివరాలు
టాప్ గెయినర్స్‌గా పతంజలి ఫుడ్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్
పతంజలి ఫుడ్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
అదే సమయంలో కొన్ని కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, వర్ధమాన్ టెక్స్‌టైల్స్ లిమిటెడ్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.
మొత్తంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్ 74,894.86 వద్ద, నిఫ్టీ 23,429.00 వద్ద రోజువారీ ట్రేడింగ్‌ను ముగించాయి.