Toyota Innova: ఇథనాల్ టెక్నాలజీ రెడీ... నవంబర్ 25న ఇన్నోవా కొత్త కార్
ఈ వార్తాకథనం ఏంటి
టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో కొత్త రూపం రాబోతోంది. 2022లో భారత మార్కెట్లోకి వచ్చిన ఈ ప్రీమియం MPVకి తొలిసారి పెద్ద స్థాయిలో అప్‌డేట్ ఇస్తోంది టయోటా. కొత్త ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను నవంబర్ 25, 2026న విడుదల చేయనుంది. ఇప్పటికే టీజర్ విడుదల కావడంతో కారుపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈసారి డిజైన్ మార్పులతో పాటు 100 శాతం బయో ఇథనాల్‌తో నడిచే E100 వెర్షన్ వస్తుందన్న వార్తే హాట్ టాపిక్‌గా మారింది.
Details
ముందు భాగంలో కొత్త లుక్
ఫేస్‌లిఫ్ట్‌లో ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుత ఆకృతిని కొనసాగిస్తూనే ముందు భాగానికి కొత్త లుక్ ఇవ్వనున్నారు.
కొత్త స్లాటెడ్ గ్రిల్, రీడిజైన్ చేసిన లోయర్ గ్రిల్, షార్ప్ లైటింగ్ ఎలిమెంట్స్ కనిపించే అవకాశం ఉంది.
వెనుక భాగంలో కొత్త బంపర్, స్వల్పంగా మారిన టెయిల్ ల్యాంప్ డిజైన్ రావచ్చు. సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద మార్పులు లేకపోయినా కొత్త అల్లాయ్ వీల్స్ అందించే అవకాశముంది.
Details
ఫీచర్లలోనూ మరిన్ని అప్‌డేట్స్
క్యాబిన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా కొత్త ఇంటీరియర్ థీమ్, సీట్ అప్‌హోల్స్టరీతో ప్రీమియం ఫీల్ పెంచే అవకాశం ఉంది.
ఇండోనేషియా వెర్షన్‌లో ఉన్న 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 7 అంగుళాల TFT MID, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ వ్యూ మానిటర్, DVR కెమెరాల వంటి ఫీచర్లలో కొన్ని భారత్‌లోనూ కనిపించొచ్చు.
దీంతో కుటుంబ ప్రయాణాలకు ఇన్నోవా మరింత టెక్ ఫ్రెండ్లీగా మారనుంది.
Detaila
ఇథనాల్‌తో నడిచే ఇన్నోవా?
ఈసారి అసలు ఆసక్తి ఇంజిన్‌పైనే. నవంబర్ 25న 100 శాతం బయో ఇథనాల్‌తో నడిచే E100 ఇన్నోవా హైక్రాస్‌ను తీసుకొస్తున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఇప్పటికే టయోటా 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది.
ప్రస్తుత హైబ్రిడ్ మోడల్ 186 hp పవర్‌ను అందిస్తోంది. కొత్త E100 వెర్షన్‌లోనూ ఇదే తరహా టెక్నాలజీకి మార్పులు చేసే అవకాశం ఉంది.
Details
ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతం ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ధరలు రూ.19.53 లక్షల నుంచి రూ.21.12 లక్షల వరకు ఉన్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు రూ.26.76 లక్షల నుంచి రూ.32.95 లక్షల వరకు ఉన్నాయి.
కొత్త ఫేస్‌లిఫ్ట్ ధరలు నవంబర్ 25న అధికారికంగా వెల్లడికానున్నాయి. ఇథనాల్ టెక్నాలజీతో వస్తే ఇన్నోవా హైక్రాస్ దేశీయ కార్ల మార్కెట్లో మరింత ప్రత్యేకమైన మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది.