Cyclone Aquan: తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు.. నవంబర్ 20 నుంచి భారీ వర్షాలు!
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారి, ఆ తర్వాత తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ తుపానుకు 'అక్వాన్' (AQUAN) అని పేరు పెట్టినట్లు సమాచారం.
వివరాలు
నవంబర్ 20 నాటికి ఏపీ తీరాన్ని తాకే అవకాశం
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా పయనించి నవంబర్ 20 నాటికి ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే అవకాశాలున్నాయి.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం
తుపాను ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తుందని అధికారులు తెలిపారు.