iPhone Duo: ఐఫోన్ డ్యూ హింజ్ కోసం భారీ ఇంజినీరింగ్.. కారు డోర్‌లా పటిష్ఠంగా!: ఆపిల్ VP చెప్పిన విషయాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ 'iPhone Duo' సెప్టెంబర్ 9న విడుదలైంది. ఈ ఫోన్ అక్టోబర్ 23 నుంచి విక్రయానికి రానుంది. ఈ నేపథ్యంలో ఫోన్ హింజ్, డిస్‌ప్లే, మన్నిక కోసం చేసిన ఇంజినీరింగ్ గురించి ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మారీబ్ TechRadarకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యంగా హింజ్ విషయంలో ఆపిల్ భారీ స్థాయిలో ఇంజినీరింగ్ పనులు చేసిందని ఆయన తెలిపారు. ఐఫోన్ డ్యూలో హింజ్ తెరిచినప్పుడు, మూసినప్పుడు పటిష్ఠంగా, ప్రీమియం అనుభూతి కలిగేలా టార్క్ ప్రొఫైల్‌ను చాలాసార్లు సర్దుబాటు చేసినట్లు మారీబ్ చెప్పారు. ఇందుకోసం హింజ్‌లోని పలు యాంత్రిక లక్షణాలను మార్చినట్లు వివరించారు.
వివరాలు
క్రీజ్ కనిపించకుండా మ్యాట్ నానో-టెక్స్చర్ కోటింగ్..
హైఎండ్ కారు తలుపును మూసినప్పుడు ఎలాంటి దృఢమైన అనుభూతి ఉంటుందో.. అదే ఫీలింగ్ ఫోన్‌ను మూసేటప్పుడు కూడా రావాలన్నదే తమ డిజైన్ ఉద్దేశమని పేర్కొన్నారు.
ఫోన్ బాగా తయారైందనే నమ్మకాన్ని వినియోగదారుల్లో కలిగించాలనుకున్నామని తెలిపారు.
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌లో 7.6 అంగుళాల అంతర్గత డిస్‌ప్లే, 5.4 అంగుళాల బయటి స్క్రీన్ ఉన్నాయి.
హింజ్‌లో 100కు పైగా భాగాలు ఉన్నాయని ఆపిల్ వెల్లడించింది. దీని రూపకల్పనలో ఖచ్చితత్వంతో పాటు దీర్ఘకాలిక మన్నిక, విశ్వసనీయతకు సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది.
ఫోల్డబుల్ డిస్‌ప్లేలో కాలక్రమేణా కనిపించే మడత గీత (క్రీజ్) విషయంలోనూ ఆపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ఐఫోన్ డ్యూలో మ్యాట్ నానో-టెక్స్చర్ కోటింగ్‌ను ఉపయోగించారు. ఇది కాంతి, ప్రతిబింబాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వివరాలు
స్క్రీన్ ప్రొటెక్టర్ వద్దంటున్న ఆపిల్.. కారణం ఇదే
అయితే ఈ డిస్‌ప్లేపై థర్డ్ పార్టీ స్క్రీన్ ప్రొటెక్టర్లను ఉపయోగించవద్దని మారీబ్ సూచించారు. డిస్‌ప్లే గ్లాస్ రూపకల్పన, రక్షణ కోసం ఆపిల్ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు.
దీర్ఘకాలంలో క్రీజ్ ఎలా కనిపిస్తుందనే విషయంలో తమను వినియోగదారులు ప్రశ్నించవచ్చని మారీబ్ అన్నారు.
మ్యాట్ నానో-టెక్స్చర్ కేవలం అందం కోసం తీసుకున్న నిర్ణయం కాదని వివరించారు.
సాధారణ మెరిసే స్క్రీన్‌పై కాంతి ప్రతిబింబం వల్ల ఉపరితలంలో స్వల్ప మార్పులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి.
మ్యాట్ ఫినిష్ ప్రతిబింబాలను తగ్గించడం ద్వారా మడత గీత కనిపించడం కూడా కొంత తగ్గేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
స్క్రీన్ ప్రొటెక్టర్ వద్దంటున్న ఆపిల్.. కారణం ఇదే
ఐఫోన్‌పై స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టుకున్న వారిని చూస్తే తనకు అసౌకర్యంగా అనిపిస్తుందని మారీబ్ వ్యాఖ్యానించారు.
అందమైన ఫ్రంట్ స్క్రీన్‌లను రూపొందించేందుకు ఆపిల్ ఎంతో కష్టపడుతుందని, అందుకే గీతలు పడకుండా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఉపయోగించినా దెబ్బతినకుండా ఉండే కొత్త కోటింగ్‌లను అభివృద్ధి చేశామని తెలిపారు.
డిస్‌ప్లే ఉపరితలాన్ని అభివృద్ధి చేసే సమయంలో పదునైన వస్తువుల వల్ల కలిగే గీతలతో పాటు రోజువారీ వినియోగం వల్ల కాలక్రమంలో ఏర్పడే అరుగుదలను కూడా ఆపిల్ పరిగణనలోకి తీసుకుందని మారీబ్ చెప్పారు.
ఒక విషయంలో రక్షణను పెంచితే మరో విషయంలో కొంత రాజీ పడాల్సి రావచ్చని, అందుకే సరైన మెటీరియల్ ఎంపిక కీలకమని వివరించారు.
వివరాలు
స్క్రీన్ ప్రొటెక్టర్ వద్దంటున్న ఆపిల్.. కారణం ఇదే
ఆపిల్ మన్నిక పరీక్షల విధానాన్ని కూడా మారీబ్ వివరించారు. సాధారణ వినియోగంలో సుమారు ఐదేళ్లపాటు ఫోన్‌ను ఉపయోగించినట్లుగా భావించే పరిస్థితులను సృష్టించి తమ పరికరాలను పరీక్షిస్తామని తెలిపారు.
పాత మిలిటరీ ప్రమాణాలు లేదా సంప్రదాయ పరీక్షలపైనే ఆధారపడకుండా, వాస్తవ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
వివరాలు
Ceramic Shield 2.. గీతలు, అరుగుదల మధ్య సమతుల్యత!
Ceramic Shield 2 విషయంలోనూ గీతలను తట్టుకునే సామర్థ్యంతో పాటు రోజువారీ వినియోగంలో దీర్ఘకాలం మన్నేలా సమతుల్యత సాధించేందుకు ప్రయత్నించినట్లు మారీబ్ తెలిపారు.
కేవలం స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను పెంచితే దీర్ఘకాలిక వేర్ రెసిస్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు.
అందుకే గీతలకు మరింత నిరోధకంగా తయారు చేయవచ్చని, అయితే అలా చేస్తే రోజువారీ వినియోగంలో ఎక్కువకాలం మన్నే సామర్థ్యం కొంత తగ్గేదని చెప్పారు.
రెండు రకాల ఒత్తిళ్లను తట్టుకుంటూ ఎక్కువకాలం పనిచేయడమే తమ లక్ష్యమని మారీబ్ పేర్కొన్నారు.