Page Loader
Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్
యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్

Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌పై విమర్శల దాడికి దిగారు. 'ఆపరేషన్ సిందూర్' అంశంపై మంత్రి జైశంకర్ స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పాకిస్థాన్‌కు ముందుగా సమాచారం అందించడమంటూ వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలు కోల్పోయిందో స్పష్టంగా చెప్పాలంటూ ఆయన నిలదీశారు. ఇది కేవలం సమాచార బహిరంగత ప్రశ్న మాత్రమే కాదు, దేశ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు.

Details

దేశ ప్రజలకు నిజాలు చెప్పాలి

"పాకిస్థాన్‌కు దాడి వివరాలు, దాని వల్ల మనకు జరిగిన నష్టం ఎంత? అంటూ రాహుల్ తన పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌనంగా ఉండటంతో నిజాలు బయటపడటం ఆలస్యం అవుతోంది. జైశంకర్ పత్రికా సమావేశాలు జరిపే బదులు దేశ ప్రజలకు నిజాలు చెప్పాలని రాహుల్ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం ఇదే అంశంపై పోస్ట్ చేసిన ఆయన, తాజా ట్వీట్‌తో ఆ విమర్శలకు మరింత ఉత్కంఠను జోడించారు.