Page Loader
Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు!
భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు!

Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

అలహాబాద్ హైకోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ ఆయనను హెచ్చరించింది. 2022లో భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, లక్నో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేయగా, వాటిని ఛాలెంజ్ చేస్తూ రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారించింది. రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, "వాక్‌ స్వాతంత్య్రం పేరుతో ఎవరైనా, ఒక వ్యక్తైనా, లేదా ఏ సేన అయినా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడానికి హక్కు లేదని స్పష్టం చేసింది.

Details

అనుచిత వ్యాఖ్యలు చేయరాదు

భవిష్యత్తులో భారత సైన్యం గురించి ఈ తరహా అనుచిత వ్యాఖ్యలు చేయరాదని హైకోర్టు రాహుల్‌కు హెచ్చరిక జారీ చేసింది. కాగా, 2022లో భారత్ జోడో యాత్రలో రాహుల్ మాట్లాడుతూ.. "చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొచ్చుకొచ్చి భారత ఆర్మీపై దాడులు చేస్తున్నారు. వారు సైనికులపై దౌర్జన్యం చేస్తున్నారు. చైనా 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. 20 మంది భారత సైనికులను చంపేశారు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై లక్నోకు చెందిన ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు, రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అయితే, ఆ సమన్లను కొట్టివేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించినట్లు స్పష్టం అయింది.