తదుపరి వార్తా కథనం

Rahul Gandi: రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. రాహుల్ గాంధీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 26, 2025
05:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
అందుకు ఆధునిక సామాజిక మాధ్యమాలే కారణమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో కొత్తతరం ప్రవేశించడం ఎంతో అవసరమని, అప్పుడు మాత్రమే కొత్త ఆలోచనలు వస్తాయని, వాటి ద్వారా దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లగలదని చెప్పారు.
Details
4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశా
ఈ సందర్భంగా ఎన్నికల ముందు కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు.
పాదయాత్రకు ముందే చాలా ఆలోచించానని, కానీ మొదలుపెట్టిన తర్వాత వెనకడుగు వేయలేదని చెప్పారు.
అనంతరం, చాలా మంది తనతో కలిసి నడవడం మొదలు పెట్టారని ఆయన వెల్లడించారు.