Page Loader
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు

Rahul Gandhi: పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022, డిసెంబర్ 16న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై పరువు నష్టం కేసు దాఖలైంది. భారత ఆర్మీపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఈ కేసు నమోదు చేశారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంక్ శ్రీవాస్తవ తరఫున న్యాయవాది వివేక్ తివారీ ఢిల్లీలో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం భారత జవాన్లపై దాడులు చేస్తుండగా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? ఎల్‌ఏసీ వద్ద చైనా చర్యలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారంటూ ప్రశ్నించారు.

Details

 గతంలో కేసు నమోదు

ఈ వ్యాఖ్యలతో భారత సైనికుల ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడినట్లు అభిప్రాయపడుతూ పరువు నష్టం దావా వేశారు. ఇక, రాహుల్‌పై వివిధ ప్రాంతాల్లో రాజకీయ ప్రత్యర్థులు మరిన్ని పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి ఈ ఏడాది (2025) జనవరిలో సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2019లో జార్ఖండ్ రాష్ట్రం చైబాసాలో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షాపై హంతకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై బీజేపీ నేత నవీన్ ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.