LOADING...
Piyush Goyal : రైతులు, ఎంఎస్ఎంఈలకు లాభం చేకూర్చే భారత్-అమెరికా ఒప్పందం: పీయూష్‌ గోయెల్
భారత భవిష్యత్తును మార్చే ఒప్పందం: పీయూష్‌ గోయెల్

Piyush Goyal : రైతులు, ఎంఎస్ఎంఈలకు లాభం చేకూర్చే భారత్-అమెరికా ఒప్పందం: పీయూష్‌ గోయెల్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
06:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయెల్ మంగళవారం మాట్లాడుతూ...ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అమెరికాతో సాధ్యమైనంత ఉత్తమమైన వాణిజ్య ఒప్పందాన్ని సాధించిందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఉన్న సన్నిహిత వ్యక్తిగత సంబంధాలే ఈ ఒప్పందం ఖరారుకు ప్రధాన కారణమని తెలిపారు. ఈ డీల్ వల్ల రైతులు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలు సహా అనేక రంగాలకు మేలు జరుగుతుందని గోయల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో వ్యవసాయం, పాడి రంగాలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించామని ఆయన వివరించారు. రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను గోయల్ తీవ్రంగా ఖండించారు.

వివరాలు 

ఈ ఒప్పందం వల్ల ఎంఎస్ఎంఈలు,మహిళలకు లాభం

గతంలో కాంగ్రెస్ పార్టీ భారత్‌ను వెనక్కి నెట్టేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో దేశాన్ని కాపాడింది ప్రధాని మోడీయేనని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అమెరికాతో కుదిరిన ఒప్పందంలో వ్యవసాయం,డైరీ రంగాల ప్రయోజనాలను రక్షించామని తెలిపారు. ఈఒప్పందం వల్ల ఎంఎస్ఎంఈలు,మహిళలకు కూడా లాభం చేకూరుతుందని చెప్పారు. లోక్‌సభలో ఈవాణిజ్య ఒప్పందంపై ప్రభుత్వం తన వాదనలు వినిపించేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రతిపక్షాలు కావాలనే సభను అడ్డుకున్నాయని గోయల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ సభలో ప్రవర్తించిన తీరు దేశం మొత్తం చూసిందని అన్నారు. ఈఒప్పందం ఒక్కరోజులోనే కుదిరిందికాదని,రెండు దేశాల మధ్య నెలల తరబడి సాగిన చర్చల ఫలితమేనని స్పష్టం చేశారు. ఈట్రేడ్ డీల్ ప్రపంచ వేదికపై భారత్‌ను మరింత బలమైన దేశంగా నిలబెడుతుందని పియూష్ గోయల్ పేర్కొన్నారు.

Advertisement