LOADING...
Rahul Gandhi: రాహుల్ గాంధీ 'డెడ్ ఎకానమీ' కామెంట్స్.. ఆయన భారత్‌కు వ్యతిరేకమని బీజేపీ ఆగ్రహం..
ఆయన భారత్‌కు వ్యతిరేకమని బీజేపీ ఆగ్రహం..

Rahul Gandhi: రాహుల్ గాంధీ 'డెడ్ ఎకానమీ' కామెంట్స్.. ఆయన భారత్‌కు వ్యతిరేకమని బీజేపీ ఆగ్రహం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆర్థిక వ్యవస్థ ''డెడ్ ఎకానమీ'' అంటూ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. రష్యా చమురు కొనుగోలు అనంతరం, భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించడం, దేశంలో వస్త్ర పరిశ్రమను రక్షించకపోవడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''సుంకాల కారణంగా ప్రభావితమైన వ్యాపారాల సమస్యలను ప్రధాన మంత్రి పరిష్కరించడం లేదు. 50 శాతం సుంకాలు, భారత వస్త్ర పరిశ్రమను దారుణంగా దెబ్బతీసింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉద్యోగాలు పోయాయి. ఆర్డర్లు తగ్గిన పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'గా మారిందని స్పష్టం చేస్తోంది'' అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ 

వివరాలు 

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. పార్టీ నేతలు,భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను డేటా ఆధారంగా చూడాల్సిందని,రాహుల్ ఆరోపణలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని వాదించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ:''ఐఎంఎఫ్ 2025 సంవత్సరానికి భారత వృద్ధి రేటును 7.3శాతంగా అంచనా వేసింది. మనం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినట్టు ఐఎంఎఫ్ పేర్కొంది.ఈయూ-భారత్ మధ్య ఒప్పందాన్ని'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా ప్రశంసించారు''అని పేర్కొన్నారు. ఆర్బీఐ డేటా ఆధారంగా,బీజేపీ హయాంలో 9 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడాయని, అయితే కాంగ్రెస్ పాలనలో కేవలం 2 కోట్లు ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని షెహజాద్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వాదనలు భారత్‌కి వ్యతిరేకంగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు.

Advertisement