
Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పుణే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.
లండన్ పర్యటన సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమన్లు వచ్చాయి.
లండన్‌లో ఉన్నప్పుడు రాహుల్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పరువునష్టం దావా దాఖలు చేశారు.
ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు గతంలో స్పష్టం చేశారు.
Details
మే 9న వ్యక్తిగతంగా హాజరుకావాలి
తాజాగా విచారణ చేపట్టిన పుణే కోర్టు, రాహుల్ మే 9న వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.
ఇక భారత్ జోడో యాత్ర సందర్భంగా సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.
దీనిపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలై, ఇటీవల హైకోర్టు కూడా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లను సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.