Rahul Gandhi: ఓట్ల చోరిని అడ్డుకుంటే బీహార్ వందశాతం ఇండియా కూటమిదే విజయం!
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆరెస్సెస్ (RSS) దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యానాల ప్రకారం, 'ఇండియా' కూటమి మాత్రం దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కిషన్‌గంజ్‌లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. రాష్ట్రంలో ఓట్ల చోరీని అడ్డుకుంటే 100 శాతం 'ఇండియా' కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి సంబంధించి ఆధారాలను చూపించాము. అయినప్పటికీ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లు దీని పై సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వాస్తవాలు ఇప్పుడు ప్రజల ముందుకొవచ్చాయి.
Details
ఉపాధిని నాశనం చేశారు
మోదీ, అమిత్ షాలు దేశంలో ఎక్కడికెళ్లినా, చివరికి 'ఓట్ల చోరీ'లో పట్టబడతారని వ్యాఖ్యనించారు. ఓట్ల చోరీని అడ్డుకుంటే బిహార్‌లో 'ఇండియా' కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, దీని కోసం యువత, రైతులు, కార్మికులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. "ప్రధాని మోదీ దేశాన్ని, బిహార్‌లో సీఎం నీతీశ్ కుమార్ ఉపాధిని నాశనం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో పలు పంటలు పండుతున్నప్పటికీ, గత 20 సంవత్సరాల్లో ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయబడలేదు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడితే వారి అవసరాలను అర్థం చేసుకోవచ్చని రాహుల్ గాంధీ చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడితే, రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరుస్తామని, యువతకు అధిక అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.