Rahul Gandhi: రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రసంగంపై ప్రివిలేజ్ నోటీసులకు సిద్ధమవుతున్నబీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీలు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్, పలుమార్లు చైనా పేరును ప్రస్తావించారు.
ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్రంగా విమర్శించడంతో, లోక్‌సభలో పరిస్థితి తీవ్రంగా మారింది.
వివరాలు
రాష్ట్రపతి ప్రసంగాన్ని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం
రాహుల్ గాంధీ తన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించలేకపోతే, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు కోరనున్నట్లు సమాచారం.
ఇదివరకు కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)పై కూడా బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ ఉపన్యాస సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రసంగాన్ని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించారు.
వివరాలు
భారత్ కంటే చైనా పదేళ్లు ముందుంది: రాహుల్
లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ, తయారీ రంగంలో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుందని వ్యాఖ్యానించారు.
భారతదేశం మోటార్లు, బ్యాటరీలు, ఆప్టిక్స్ వంటి పరికరాల కోసం ఇప్పటికీ చైనా మీద ఆధారపడుతోందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తీసుకొచ్చిన 'మేకిన్ ఇండియా' కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, చైనాలో ఉత్పత్తి అయిన వస్తువులు పెద్దఎత్తున భారత మార్కెట్లోకి వస్తున్నాయని ఆయన విమర్శించారు.