Page Loader
Kharge,Rahul: జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వండి..ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ 
జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వండి..ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ

Kharge,Rahul: జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వండి..ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముక‌శ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా క‌ల్పించేందుకు అవసరమైన చట్టాన్ని రాబోయే వ‌ర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాల‌ని కోరుతూ ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు. లడాక్‌ను రాజ్యాంగంలోని ఆర‌వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల‌ని ప్రభుత్వం వెంట‌నే చర్య‌లు చేప‌ట్టాల‌ని వారు ఈ లేఖ‌లో కోరారు. గత ఐదేళ్లుగా జ‌మ్మూక‌శ్మీర్ ప్రజలు తమకు మళ్లీ రాష్ట్ర హోదా కావాల‌ని నిరంతరం కోరుతున్నార‌ని ఖ‌ర్గే, రాహుల్‌లు లేఖ‌లో ప్రధానమంత్రికి గుర్తు చేశారు. తమ ఈ డిమాండ్‌ రాజ్యాంగానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యానికి లోబడిన హక్కుల పరిధిలోనిదేన‌ని స్పష్టంచేశారు.

వివరాలు 

క‌శ్మీర్‌కు మ‌ళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామ‌ని ప్రధాని మోదీ హామీ

గతంలో కేంద్ర పాలిత ప్రాంతాల‌ను మళ్లీ రాష్ట్రాలుగా మార్చిన ఉదాహరణలు ఉన్నాయ‌ని, కానీ జ‌మ్మూక‌శ్మీర్ విష‌యంలో మాత్రం విభజన జరిపి, పూర్తిస్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినందున ఇది అన్యాయమని ఖ‌ర్గే తీవ్రంగా విమర్శించారు. క‌శ్మీర్‌కు మ‌ళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామ‌ని ప్రధాని మోదీ గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు తమ లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా, ఆర్టిక‌ల్ 370 రద్దు సమయంలో కూడా పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ క‌శ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించ‌నున్నామ‌ని స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్