Page Loader
EC: మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్.. లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తామన్న ఎన్నికల సంఘం
మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్..స్పందించిన ఎన్నికల సంఘం

EC: మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్.. లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తామన్న ఎన్నికల సంఘం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ఈ ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

వివరాలు 

ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో మీడియా సమావేశం 

ఈ విషయంపై ఈసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో స్పందిస్తూ "రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వారి అభిప్రాయాలు, సూచనలు, ప్రశ్నలను గౌరవంతో స్వీకరిస్తాం. ఈ ఆరోపణలపై త్వరలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తాం. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు, విధానపరమైన అంశాలతో కమిషన్‌ వివరణ అందిస్తుంది" అని పేర్కొంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో రాహుల్ గాంధీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్,ఎన్‌సీపీ-ఎస్‌సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

వివరాలు 

ఓటర్ల జాబితా,వారి ఫొటోలు, చిరునామాలను అందించాలి: రాహుల్ గాంధీ

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ"లోక్‌సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారు.గత ఐదేళ్లలో రాష్ట్రంలో 32లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అంతే కాకుండా,మహారాష్ట్రలో లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అసలు వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?" అని ప్రశ్నించారు. అదనంగా,"39 లక్షల ఓటర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఓటర్ల సంఖ్యకు సమానం.లోక్‌సభ ఎన్నికల్లో మేము పొందిన ఓట్ల శాతం,అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం సమానంగా ఉంది.కానీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు మాత్రం అదనంగా ఓట్లు వచ్చాయి.ఆఓట్ల ద్వారానే వారికి విజయం లభించింది.ఎన్నికలసంఘం మా డిమాండ్‌ను స్వీకరించి,ఓటర్ల జాబితా,వారి ఫొటోలు, చిరునామాలను అందించాలి"అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.