LOADING...
Priyanka Gandhi: 'అవమానాల శాఖ'ను ఏర్పాటు చేయాలి.. మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్లు
'అవమానాల శాఖ'ను ఏర్పాటు చేయాలి.. మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్లు

Priyanka Gandhi: 'అవమానాల శాఖ'ను ఏర్పాటు చేయాలి.. మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశాన్ని, బీహార్‌ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అవమానాల మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేయాలని వ్యంగ్యంగా సూచించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోన్‌బర్సాలో నిర్వహించిన ప్రచార సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ అనవసర విషయాలపై మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనలపై మాత్రం నోరు విప్పడం లేదని అన్నారు. ఆమె విమర్శిస్తూ ప్రధాని ప్రతిపక్ష నేతలు దేశాన్ని, బీహార్‌ను అవమానిస్తున్నారని పదేపదే చెబుతున్నారు.

Details

ఏన్డీయే ప్రభుత్వం ఏమీ చేసిందో ప్రజలకు చెప్పాలి

అభివృద్ధి గురించి మాట్లాడటానికి బదులు ఈ ఆరోపణలపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారాలపై ప్రత్యేకంగా 'అవమానాల శాఖ' ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. అలాగే, ఎన్నికల సమయంలో కొత్త కొత్త హామీలు ఇస్తున్నా, 20 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని ప్రియాంక డిమాండ్‌ చేశారు. బీహార్‌ ప్రభుత్వం నిజంగా నీతీశ్‌ కుమార్‌ చేతుల్లో లేదని, ప్రధాన మంత్రి మోదీ, ఇతరులు దిల్లీ నుంచే రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును లాక్కొనే ప్రయత్నం జరుగుతోందని, ఉద్యోగ అవకాశాలు లేక యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.