LOADING...
Rahul Gandhi: రష్యా చమురు డీల్‌పై ట్రంప్.. ఐదు ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ
రష్యా చమురు డీల్‌పై ట్రంప్.. ఐదు ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: రష్యా చమురు డీల్‌పై ట్రంప్.. ఐదు ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తునట్లు హామీ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను చూసి మోదీ భయపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కొన్ని కీలక ప్రశ్నలు కూడా సంధించారు.

ప్రశ్నలు 

రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు 

రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకూడదని ట్రంప్ నిర్ణయించడానికి భారత్ అనుమతిస్తోందా? పదేపదే తిరస్కరణలు ఎదురైనప్పటికీ అభినందన సందేశాలు పంపడం ఎందుకు? ఆర్థికమంత్రి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నాం. ఈజిప్టు, షర్మ్-ఎల్ షేక్‌లో సోమవారం గాజా శాంతి సమ్మిట్ జరిగింది, ఆ కార్యక్రమానికి ప్రధాని హాజరుకాలేదు. ఆపరేషన్ సిందూర్ గురించి ట్రంప్ పదేపదే చేస్తోన్న ప్రకటనలను విభేదించడం లేదు'' అని రాహుల్ గాంధీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ 

వివరాలు 

అమెరికా నుంచి సుమారు 12-13 బిలియన్‌ డాలర్ల వరకు విలువైన ఇంధనం కొనుగోళ్లను పెంచే అవకాశం

అమెరికా (USA) నుంచి చమురు కొనుగోలుకు భారత్ సిద్ధంగానే ఉందని వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, సరైన ధర లభిస్తేనే ఈ ఆలోచనను కొనసాగిస్తామని చెప్పారు. గతంలో భారత్ అమెరికా నుంచి 22-23 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేసిందని, ఇంకా 12-13 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నడుస్తోన్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వివరాలు 

భారత్ యూఎస్‌కు సన్నిహిత భాగస్వామి

ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ నుంచి ప్రకటన వచ్చింది. వైట్‌హౌస్‌లో రిపోర్టర్లతో మాట్లాడుతూ, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడం ద్వారా పుతిన్ యుద్ధ నిధులను పొందుతున్నారని, ఇది ఆందోళనకు కారణమని తెలిపారు. ప్రధాని మోదీ తనకు ఈ కొనుగోళ్లను ఆపడానికి హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. ఇది ఒక కీలక ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక, చైనా కూడా రష్యా ఆయిల్ కొనదు అని ట్రంప్ జోడించారు. ఇంధన విధానంపై భారత్, అమెరికా మధ్య కొన్ని భేదాలు ఉన్నప్పటికీ, భారత్ యూఎస్‌కు సన్నిహిత భాగస్వామి అని ఆయన తెలిపారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రావలసింది.