LOADING...
Pm Modi: మోదీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో సరికొత్త చరిత్ర
మోదీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో సరికొత్త చరిత్ర

Pm Modi: మోదీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో సరికొత్త చరిత్ర

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా వేదికలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. తాజాగా యూట్యూబ్‌లో ప్రపంచ స్థాయిలో అత్యధిక మంది అనుచరులు ఉన్న రాజకీయ నాయకుడిగా కొత్త రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం మోడీ అధికారిక యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 3 కోట్లను దాటింది. 30 మిలియన్ సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అందుకున్న తొలి ప్రపంచ నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రపంచ నేతల జాబితాలో మొదటి స్థానంలో మోదీ ఉండగా,రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. అయితే మోదీ సబ్‌స్క్రైబర్ల సంఖ్యతో పోలిస్తే బోల్సోనారోకు దాదాపు నాలుగో వంతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఇన్‌స్టాగ్రామ్‌లో 100మిలియన్ ఫాలోవర్లు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చితే మోడీకి సబ్‌స్క్రైబర్లు సుమారు ఏడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశీయ స్థాయిలోనూ మోడీ ముందంజలోనే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధిక సబ్‌స్క్రైబర్లను ఆయన కలిగి ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ,కాంగ్రెస్ అధికారిక యూట్యూబ్ ఛానళ్ల కంటే కూడా మోడీ ఛానల్‌కు సుమారు నాలుగు రెట్లు ఎక్కువ మంది అనుచరులు ఉన్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మోదీ కొత్త మైలురాయిని అందుకున్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 10కోట్లకు చేరుకుంది. ప్రపంచ రాజకీయ నేతల్లో 100మిలియన్ ఫాలోవర్లను సాధించిన తొలి నాయకుడిగా రికార్డు నెలకొల్పారు. మోడీ తరువాత రెండో స్థానంలో ఉన్న ట్రంప్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.35కోట్ల ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement