Loading...
Famous Flower Markets: అమ్మాయిలను పడేయ్యాలంటే..ఈ పూల మార్కెట్లకు తీసుకెళ్లాల్సిందే
అమ్మాయిలను పడేయ్యాలంటే..ఈ పూల మార్కెట్లకు తీసుకెళ్లాల్సిందే

Famous Flower Markets: అమ్మాయిలను పడేయ్యాలంటే..ఈ పూల మార్కెట్లకు తీసుకెళ్లాల్సిందే

వ్రాసిన వారు Balachander Sharma
Oct 22, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పూలంటే ఇష్టపడేవారికి పూల మార్కెట్లు ఓ అందమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. తెల్లవారుజామునే మొదలయ్యే వ్యాపారం, బుట్టల్లో నిండుగా కనిపించే రంగురంగుల పూలు, వాటి సువాసనలు, కొనుగోలుదారుల సందడి.. ఇవన్నీ కలిసి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలను చూడాలనుకునేవారికి ఇవి మంచి డేట్‌ స్పాట్స్‌గా కూడా మారవచ్చు. దేశంలోని 8 ప్రసిద్ధ పూల మార్కెట్లు, పూల సాగు ప్రాంతాలు ప్రయాణ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

Details

ముల్లిక్‌ ఘాట్‌ - కోల్‌కతా

కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి సమీపంలోని ఈ మార్కెట్‌ తెల్లవారుజామునే కళకళలాడుతుంది.

బంతి, గులాబీ, మల్లె వంటి పూల మధ్య ఫొటోలు తీసుకోవచ్చు. నది, వంతెన నేపథ్యం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ.

Details

కేఆర్‌ మార్కెట్‌ - బెంగళూరు

బెంగళూరు నగరంలోని పురాతన మార్కెట్లలో ఒకటైన కృష్ణరాజేంద్ర మార్కెట్‌లో పూల వ్యాపారం సందడిగా సాగుతుంది.

స్థానిక జీవనశైలిని దగ్గరగా చూడాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

ADVERTISEMENT

Details

ఘాజీపూర్‌ - ఢిల్లీ

గులాబీలు, లిల్లీలు, ఆర్కిడ్స్‌ సహా అనేక రకాల పూలు ఇక్కడ కనిపిస్తాయి.

పెద్ద మొత్తంలో పూల కొనుగోళ్లు జరిగే ఈ మార్కెట్‌ ఉదయం సందర్శించడానికి అనువైన ప్రదేశం.

ADVERTISEMENT

Details

దాదర్‌ - ముంబై

పూల దండలు, బొకేలు, పూజా అలంకరణలకు అవసరమైన పూలతో దాదర్‌ మార్కెట్‌ సందడిగా ఉంటుంది.

ముంబై సంప్రదాయ మార్కెట్‌ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

Details

కొచ్చి - కేరళ

ఎర్నాకులం, మట్టాంచేరి ప్రాంతాల్లో సంప్రదాయ పూలతో పాటు ఉష్ణమండల పూలు కూడా లభిస్తాయి.

స్థానిక సంస్కృతిని తెలుసుకునేందుకు ఇది ఆసక్తికరమైన ప్రాంతం.

Details

మండి - హిమాచల్‌ ప్రదేశ్

గులాబీలు, లిల్లీలు, కార్నేషన్లు సాగు చేసే ప్రాంతాలను సందర్శిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

Details

కోయంబత్తూరు - తమిళనాడు

మల్లెపూలు, బంతిపూలు, సంపంగి, పూల దండలకు ఈ మార్కెట్‌ ప్రసిద్ధి. పండుగలు, వివాహాల కోసం జరిగే పూల అలంకరణల ప్రత్యేకతను ఇక్కడ చూడవచ్చు.

Details

పుష్కర్‌ - రాజస్థాన్

గులాబీల సాగుకు పేరొందిన పుష్కర్‌లో రోజ్‌ వాటర్‌, అత్తర్‌, గుల్కండ్‌ తయారీ గురించి తెలుసుకోవచ్చు.

ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు పూల సువాసనల ప్రపంచాన్ని ఆస్వాదించవచ్చు.

ఈ ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారు వీలైతే ఉదయం వేళల్లో సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మార్కెట్ల అసలైన సందడి కనిపిస్తుంది.

స్థానిక వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ఫొటోలు తీయడం, పూల కొనుగోళ్ల సమయంలో ధరలు తెలుసుకోవడం మంచిది.

ఇలా పూల మార్కెట్ల సందర్శన సాధారణ పర్యటనకు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.

ADVERTISEMENT