LOADING...
Rahul Gandhi: నీరు కాదు, విషం.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు
నీరు కాదు, విషం.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు

Rahul Gandhi: నీరు కాదు, విషం.. ఇండోర్‌లో కలుషిత తాగునీటి మరణాలపై రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీరు త్రాగి 10 మంది ప్రాణాలు కోల్పోవడం, పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవడం పై కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అత్యంత పరిశుభ్ర నగరాలలో ఒకటిగా పేరు పొందిన ఇండోర్‌లో తాగునీటిలో కాలుష్యం ఎలా ఏర్పడిందని, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "ఇండోర్‌లో నీళ్లు లేవు, దానికి బదులుగా విషం సరఫరా చేస్తున్నారు. అధికార యంత్రాంగం కుంభకర్ణుడిలా నిద్రపోతోంది. ప్రతి ఇంట్లో దుఃఖం నెలకొంది. పేదలు నిస్సహాయులుగా ఉన్నారు. వారికి స్వాంతన కలించేందుకు బదులుగా బీజేపీ ప్రభుత్వం అహంకారపూరిత ప్రకటనలు చేస్తోంది" అని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పేర్కొన్నారు.

వివరాలు 

కైలాస్ విజయవర్గీయ అభ్యంతకర వ్యాఖ్యలు తప్పుబట్టిన రాహుల్ 

మురికి, దుర్వాసన వచ్చే నీటి గురించి ప్రజలు పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ వారి ఫిర్యాదులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని రాహుల్ ప్రశ్నించారు. తాగునీటిలో మురుగునీరు ఎలా చేరింది? సరఫరాను సమయానికి ఆపలేదా? బాధ్యులైన అధికారులు, నాయకులపై విచారణ ఎప్పుడు జరుగుతుంది? వంటి ప్రశ్నలను ఆయన అడిగారు. ఇంకా, కలుషిత నీటి విషయంలో మీడియాకు మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయవర్గీయ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో దుష్ట పాలన నడుస్తోందని, దగ్గు సిరప్ దురంతాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకల కారణంగా చిన్న పిల్లల మరణాలు, ఇప్పుడు మురుగునీటితో మరణాలు చోటుచేసుకుంటోందని రాహుల్ గాంధీ తెలిపారు. పేదలు చనిపోతున్నప్పుడు, ప్రధాని మోదీ ఎప్పటిలాగే మౌనంగా ఉన్నారని ఆయన విమర్శించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ 

Advertisement