LOADING...
Rahul Gandhi: ఇండోర్‌లో అతిసార బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ
ఇండోర్‌లో అతిసార బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: ఇండోర్‌లో అతిసార బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇండోర్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల భగీరథపురంలో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాహుల్ గాంధీ భగీరథపురాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అలాగే బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటి ఘటనలో మృతి చెందిన వారికి ఆయన సంతాపం తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉండటంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

Details

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు

రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అంతకుముందు ఆయన ఇండోర్ విమానాశ్రయానికి చేరుకోగానే కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు చేరుకుని రాహుల్ గాంధీకి స్వాగతం తెలిపారు.

Advertisement