
Rahul Gandi: రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ.. నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
జార్ఖండ్ రాష్ట్రం చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆయనపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను జారీ చేసింది.
ఈ మేరకు రాహుల్ జూన్ 26న స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్‌గాంధీ అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు బీజేపీ నేత ప్రతాప్ కటియార్ ఆరోపించారు.
'హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా బీజేపీ అధ్యక్షులు కావచ్చు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని పరువు నష్టం కేసును దాఖలు చేశారు.
Details
విచారణకు హాజరు కాని రాహుల్
తదుపరి విచారణలో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతో 2020 ఫిబ్రవరిలో కేసును రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు.
అనంతరం ఈ కేసును మళ్లీ చైబాసా కోర్టుకు తరలించారు. దీనికి అనుగుణంగా కోర్టు రాహుల్‌గాంధీకి అనేక సార్లు సమన్లు జారీ చేసింది.
రాహుల్ గాంధీ వరుసగా విచారణకు హాజరుకాకపోవడంతో మొదట బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
అనంతరం ఆయన తరఫు న్యాయవాది జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు.
మార్చి 20, 2024న హైకోర్టు వారి పిటిషన్‌ను కొట్టివేసింది. తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం మరో పిటిషన్‌ను చైబాసా కోర్టులో దాఖలు చేయగా, దానిని కూడా తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో న్యాయస్థానం తాజాగా రాహుల్ గాంధీపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.