Page Loader
'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్.. 
రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్..

'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
06:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగంపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక స్పందన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఢిల్లీలోని ద్వారకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతిని అవమానించారని ఆయన మండిపడ్డారు.

వివరాలు 

బీజేపీ తీవ్ర ఆగ్రహం

కాంగ్రెస్ నేతృత్వం ద్రౌపది ముర్ముపై అహంకారంతో కూడిన ధోరణిని ప్రదర్శించిందని మోడీ ఆరోపించారు. ''రాజకుటుంబం (షాహీ పరివార్)వారిని చూడండి. గిరిజన నేపథ్యం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారు. ఆ కుటుంబానికి చెందిన ఒకరు ఆమె ప్రసంగాన్ని 'బోరింగ్'గా అభివర్ణించారు. మరొకరు 'పాపం' అంటూ గిరిజనులను కించపరిచారు'' అని మోడీ నేరుగా సోనియా గాంధీ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం, సోనియా గాంధీ మాట్లాడు,''రాష్ట్రపతి చివరికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం'' అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కూడా ప్రసంగాన్ని'బోరింగ్' అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ పరంగా అత్యున్నత పదవిని అవమానించినట్లుగా మోదీ ఆరోపించారు.

వివరాలు 

రాష్ట్రపతిపై మాకు గౌరవం పూర్ణంగా ఉంది: ప్రియాంక 

గిరిజనులపై కాంగ్రెస్ వైఖరి ఎలా ఉందో అర్థమవుతుందని అని మోడీ అన్నారు. అయితే, ఈ వివాదంపై ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, ''నా తల్లి 78 ఏళ్ల మహిళ. రాష్ట్రపతి సుదీర్ఘ ప్రసంగం వల్ల అలసిపోయారని మాత్రమే వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిపై మాకు గౌరవం పూర్ణంగా ఉంది. కానీ మీడియా ఈ విషయాన్ని వక్రీకరించడం విచారకరం'' అని వివరణ ఇచ్చారు.