
Rahul Gandhi: పూంచ్‌లో పాకిస్తాన్ దాడులు.. 22 మంది అనాథ పిల్లలను'దత్తత' తీసుకోనున్న రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంలో ఏర్పడిన సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కోల్పోయిన జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాకు చెందిన 22 మంది చిన్నారులను రాహుల్ గాంధీ దత్తత తీసుకోనున్నట్లు జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ తెలిపారు. ఈ చిన్నారులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే వరకూ వారి విద్యా అవసరాలు, దైనందిన ఖర్చులు, ఇతర అవసరాలన్నింటినీ రాహుల్ గాంధీ భర్తీ చేయనున్నారని ఆయన చెప్పారు.
వివరాలు
22 మంది పిల్లల వివరాలతో జాబితా
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాలను రాహుల్ గాంధీ సందర్శించిన సందర్భంగా, పూంఛ్ జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల వివరాలను సమకూర్చి ఓ జాబితా తయారు చేయాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారని హమీద్ వెల్లడించారు. ఈ సూచన మేరకు ఒక సర్వే నిర్వహించి మొత్తం 22 మంది పిల్లల వివరాలతో జాబితా రూపొందించామని ఆయన చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
22 మంది అనాథ పిల్లలను'దత్తత' తీసుకోనున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi to ‘adopt’ 22 children who lost their parents in Pakistani shelling during Op Sindoor.#RGCares | #FollowUp | #IssueBasedPolitics pic.twitter.com/b4yyQpx9pM
— INC News 24x7 (@News4INC) July 29, 2025