Rahul Gandhi: ప్రభుత్వ గుత్తాధిపత్యమే దీనికి కారణం.. ఇండిగో విమానాల సేవలపై రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అగ్రవర్గ విమానయాన సంస్థ అయిన ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. ఈ పరిస్థితిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన ప్రభుత్వ గుత్తాధిపత్యమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని విమర్శించారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదికపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండిగో విమానాల రద్దులు, ఆలస్యాలకు ప్రభుత్వ అనుభవాలు ప్రధాన కారణమని, సాధారణ పౌరులు ఎప్పటిలాగే ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు విమానయాన రంగంలో సక్రమమైన, న్యాయమైన పోటీ ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యం కుదరదని ఆయన తేల్చి చెప్పారు.
వివరాలు
నేడు 450కి పైగా విమానాల సర్వీసులు రద్దు
ఈ వ్యవహారం గురించి పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు నోటీసులు అందించారు. ఇండిగో విమానాల్లో అంతరాయం వల్ల దేశవ్యాప్తంగా అనేక ప్రయాణికులు కష్టపడి ఉన్నారని, వేలాది మంది ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. విమానాశ్రయాల కార్యకలాపాలు కూడా ప్రభావితమైపోయాయని,ఇలాంటి పరిస్థితులు మరల పునరావృతం కాకుండా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నఅభ్యర్థన చేశారు. గత మూడు రోజులుగా ఇండిగో విమానాల సేవల్లో గందరగోళం కొనసాగుతోంది. నిర్వాహణలోపాల కారణంగా అనేక విమానాలు రద్దు,ఆలస్యమవుతున్నాయి, ఫలితంగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం మాత్రమే 450కి పైగా విమానాల సర్వీసులు రద్దు అయ్యాయి.