LOADING...
Arjun Tendulkar-Saaniya: అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియోలు
అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియోలు

Arjun Tendulkar-Saaniya: అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల పెళ్లి వేడుకల సందడి మొదలైంది. పెళ్లికి ముందు జరిగే మెహందీ,సంగీత్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

వివరాలు 

పెళ్లి వేడుకలకు ప్రత్యేక అతిథులు

మార్చి 5న ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం జరగనుంది. ఇటీవల జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం ప్రత్యేకంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు కూడా నిర్వహించింది. మరోవైపు సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి టెండూల్కర్ స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి వివాహ ఆహ్వాన పత్రికలు అందజేశారు. మార్చి 5న జరిగే ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకలకు దేశంలోని ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా పలువురు ప్రత్యేక అతిథులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Advertisement