Rahul Gandhi: 'ఆ సినిమా ఎవరూ చూడట్లేదు'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు సినిమాలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. పలు వివాదాల మధ్య ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ 2 సినిమాపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ప్రజలు పెద్దగా చూడటం లేదని కూడా పేర్కొన్నారు. నిజమైన కేరళ సంస్కృతి, సంప్రదాయాలు దేశ ప్రజలందరికీ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. సమాజంలో విద్వేషాలను పెంచడం కోసం, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి కొందరు వ్యక్తులు సినిమాలు, మీడియాను ఆయుధాల్లా వినియోగిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అంశాలను బహిరంగంగా ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతాయని, వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వబోరని ఆయన ఆరోపించారు.
Details
ఇంట్లో కుర్చొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు
తాను కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలను మనోజ్ తివారి భార్య సురభి తివారీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇంట్లో కూర్చొని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని అన్నారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన తర్వాత, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కేసులు చదివిన తర్వాత ప్రజలే అది నిజమో కాదో నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, 2023లో విడుదలైన ది కేరళ స్టోరికి సినిమాకు కొనసాగింపుగా 'ది కేరళ స్టోరీ 2' రూపొందింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు.