
Modi-Rahul Gandhi: ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఈ భేటీ 2025 మే 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నిర్వహించారు.
ఇద్దరూ అధికారికంగా సమావేశం కావడంతో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారి తీసింది.
ఈ సమావేశంలో ముఖ్యంగా కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకం అంశంపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా హాజరైనట్టు తెలిసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోదీతో రాహుల్ గాంధీ భేటీ
VIDEO | Congress MP and Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi) reaches PMO to meet Prime Minister Narendra Modi (@narendramodi).
— Press Trust of India (@PTI_News) May 5, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/PXoyTiDSNN
వివరాలు
కొత్త డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, సీజేఐ సంజీవ్ ఖన్నా
ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది.
ఆయన మే 2023లో రెండు సంవత్సరాల గల పదవీకాలానికి నియమితులయ్యారు.
మే 2025తో ఆయన పదవీకాలం పూర్తవుతుండటంతో, కొత్త డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, సీజేఐ సంజీవ్ ఖన్నా పరస్పరం చర్చించారు.