Rahul Gandhi: పేదల హక్కులను కాపాడాలి.. MGNREGAపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు తెలిపారు. ఈ నిర్ణయం పేద ప్రజలపై జరిగిన దాడి వంటి చర్య అని ఆయన పేర్కొన్నారు. ఎంజీ నరేగా కేవలం ఒక పథకం మాత్రమే కాక, గ్రామీణ పేదల పని హక్కు అని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ ఆరోపించినట్లుగా సంబంధిత మంత్రులను సంప్రదించకుండా, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, దేశంలో పాలన వన్ మ్యాన్ షోగా మారిపోతోందని తెలిపారు.
Details
గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
మోదీ ఏది కోరుకుంటే దేశంలో అదే అమలవుతోందని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిపక్షం ముందుకు రావాల్సిందని పిలుపునిచ్చారు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఈ పథకాన్ని ఎలా మార్చుతారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానిస్తూ, యువతకు ఉద్యోగాలు ఇవ్వక, వారి భవిష్యత్తును నాశనం చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా నిలిపివేస్తోందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చి, అన్నం అందించేలా చేసిన పథకాన్ని రద్దు చేస్తే ప్రజలు దాని ప్రభావాన్ని సావధానంగా చూడలేరని హెచ్చరించారు.
Details
ప్రజల తరుపున నిరంతరం పోరాడుతూనే ఉంటాం
రాష్ట్రాల, దేశంలోని వ్యవస్థలపై కేంద్రం తీసుకుంటున్న ఏకపాక్షిక నిర్ణయాలపై ప్రజల తరఫున కాంగ్రెస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ పథకం రద్దును వ్యతిరేకిస్తూ, జనవరి 5నుంచి దేశవ్యాప్తంగా 'ఎంజీనరేగా బచావో అభియాన్' పేరుతో నిరసనలు చేపడతామని ఆయన ప్రకటించారు.