LOADING...
PM Modi: 'నీకు నువ్వు చక్రవర్తి అనుకుంటున్నావా?'.. రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ ఫైర్ 
'నీకు నువ్వు చక్రవర్తి అనుకుంటున్నావా?'..రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ ఫైర్

PM Modi: 'నీకు నువ్వు చక్రవర్తి అనుకుంటున్నావా?'.. రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ ఫైర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

విపక్ష ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం రాజ్యసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ తనను తాను చక్రవర్తి అనుకుంటున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విపక్ష నేతల్లో ఎవరికి నిజమైన అవగాహన లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో సభ్యులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, అయితే విపక్ష ఎంపీలు ఇందుకు భిన్నంగా, అనుచితంగా ప్రవర్తించారని మోదీ సీరియస్‌గా వ్యాఖ్యానించారు.

వివరాలు 

రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్

అవసరమైనప్పుడు ఇండియాతో సహకరించడానికి గతంలో కూడా అనేక దేశాలు ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అలాగే, "రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్" అనే మంత్రాన్ని దృఢంగా చేపట్టి దేశం ముందుకు సాగుతున్నదని మోదీ తెలిపారు. ప్రతిస్పర్థత ఉన్న అన్ని రంగాల్లో భారత్‌ ఇప్పుడు పూర్తి స్థాయిలో పోటీ పడటానికి సిద్ధమై ఉన్నదని ఆయన హైలైట్ చేశారు.

వివరాలు 

ఈయూతో చారిత్రక ట్రేడ్ డీల్

బెంగాల్‌లో చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని, బెంగాల్ ప్రజల హక్కులను సీఎం మమతా బెనర్జీ హరిస్తున్నారని మోదీ ఉల్లేఖించారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు వలసదారులను నియంత్రిస్తున్నప్పటికీ, మన దేశంలో అక్రమ వలసదారులను రక్షించాలన్న దృక్పథంపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆప్ నేతలు లిక్కర్ కుంభకోణాలకు పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలో కాంగ్రెస్ అనేక తప్పులు, కుంభకోణాలు చేసింది. కాంగ్రెస్ చేసిన తప్పులు సరిదిద్దడానికి మాకు చాలా సమయం పట్టింది. ప్రధానంగా, భారత్-యూఎస్‌ మధ్య చారిత్రక ట్రేడ్ డీల్‌లో ఒప్పందం జరగడం దేశానికి, ముఖ్యంగా యువతకు పెద్ద లాభాలు తెచ్చే అవకాశం ఉందని మోదీ పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

'కూర్చోండి ఖర్గే గారు'..

ఇదిలా ఉంటే, రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై మోడీ సెటైర్లు వేశారు. ఆయన ప్రసంగం ప్రారంభమైన వెంటనే విపక్షాల నినాదాలు మొదలయ్యాయి. ఖర్గే తన స్థానంలో నిలబడి నినాదాలు చేస్తుండటం మోడీ గమనించారు. ఈ సందర్భంలో 'ఖర్గే గారు, వయసు దృష్ట్యా కూర్చోని నినాదాలు చేయవచ్చు' అని మోడీ సెటైర్ వేశారు.

Advertisement