Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 15వేల ఓట్ల ఆధిక్యలో కాంగ్రెస్ అభ్యర్థి
ఈ వార్తాకథనం ఏంటి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి నుంచే ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఆరు రౌండ్లలోనూ ఆయనే ముందంజలో నిలిచారు. ఆరో రౌండ్ ముగిసే సమయానికి నవీన్ యాదవ్ 15 వేల ఓట్లకు పైగా భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. ఇప్పటివరకు షేక్‌పేట, ఎర్రగడ్డ, రహమత్‌నగర్ డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థే ముందున్నారు. మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యగా, అందులో 96 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. వీటిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 43 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు 25 ఓట్లు, దీపక్ రెడ్డికి 20ఓట్లు లభించాయి.
Details
రౌండ్ల వారీగా పార్టీ అభ్యర్థుల ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి
మొదటి రౌండ్ నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 8,911 మాగంటి సునీత (BRS): 8,864 దీపక్ రెడ్డి (భాజపా): 2,167 రెండో రౌండ్ నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 9,691 మాగంటి సునీత (BRS): 8,609 దీపక్ రెడ్డి (భాజపా): 3,475 మూడో రౌండ్ నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 11,082 మాగంటి సునీత (BRS): 8,082 దీపక్ రెడ్డి (భాజపా): 3,475
Details
నాలుగో రౌండ్
నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 9,567 మాగంటి సునీత (BRS): 6,020 ఐదో రౌండ్ నవీన్ యాదవ్ (కాంగ్రెస్): 12,283 మాగంటి సునీత (BRS): 8,985 జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో లెక్కింపు తుది దశకు చేరుతుండగా, నవీన్ యాదవ్ ఆధిక్యం మరింత బలపడుతోంది.