Navjot Singh Sidhu: సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తే.. మళ్లీ రాజకీయాల్లోకి మాజీ క్రికెటర్ సిద్దూ
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) మళ్లీ రాజకీయాల్లో పాల్గొననున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, సిద్ధూ పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారని ఆయన భార్య నవ్‌జోత్ కౌర్ సిద్ధూ స్పష్టం చేశారు. ఏ పార్టీకి భారీ మొత్తాలు చెల్లించే ఆర్థిక స్థోమత తమకు లేదని ఆమె స్పష్టం చేస్తూనే, అధికారంలోకి వస్తే పంజాబ్‌ను 'బంగారు రాష్ట్రంగా' మార్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
Details
సీఎం పదవి కావాలంటే రూ.500 కోట్లు చెల్లించాల్సిందే
'మేము ఎప్పుడూ పంజాబ్, పంజాబియత్ కోసం పోరాడుతూనే ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలంటే రూ.500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అంత డబ్బు మా వద్ద లేదని కౌర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించడంపై గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను కలిసి వచ్చాక ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు డబ్బు ఎవరు డిమాండ్ చేశారో మాత్రం ఆమె వెల్లడించలేదు. అయితే, 'రూ.500 కోట్లు ఇచ్చినవాడే సీఎం కుర్చీకి అర్హుడు అవుతున్న వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. ఏ పార్టీ అవకాశమిచ్చినా, సిద్ధూ పంజాబ్ అభివృద్ధికోసం నిజాయితీగా పనిచేస్తారని ఆమె అన్నారు.