
YS Sharmila: 'తల్లిని మోసం చేసిన కొడుకుగా మిగిలాడు'.. జగన్‌పై షర్మిల ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
తల్లి మీద కేసు వేసిన వాడిగా జగన్ రెడ్డి మిగిలాడని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేసింది.
విజయవాడలో వక్ఫ్ బిల్లు అంశంపై మాట్లాడిన ఆమె, ఎన్సీఎల్టీలో జగన్ దాఖలు చేసిన అఫిడవిట్‌పై స్పందించారు.
జగన్ స్వయంగా ఎంవోయూపై సంతకం పెట్టారని, ఆస్తులు ఎవరికి అనేది తానే నిర్ణయించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటిని కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ఇచ్చిన గిఫ్ట్ తనకే కాకుండా తల్లి విజయమ్మకు కూడా అని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆస్తులను వెనక్కి అడుగుతున్నారని, తల్లిని మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
జగన్ నన్ను ప్రభావితం చేసే స్థాయిని ఎప్పుడో దాటి పోయారని, కానీ తన పిల్లలను మోసం చేసిన వాడిగా మిగిలిపోయారన్నారు.
Details
ఎన్సీఎల్టీలో కేసు
తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనకోడలికి చెందిన ఆస్తులను కాజేసిన మేనమామగా జగన్ పేరుమిగిలిపోతుందని షర్మిల తీవ్ర విమర్శలు చేసింది.
తన ఆస్తుల గురించి జగన్ ఏమి నిర్ణయిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి లేదని, ఇకపై అది తనకు సంబంధం లేదని తేల్చేశారు.
తమకు తెలియకుండానే 51% వాటాలను అక్రమంగా బదిలీ చేసుకున్నారని, ఈ బదిలీని రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
జగన్ తరఫు లాయర్ వాదన ప్రకారం, గిఫ్ట్ షేర్లను తాను భౌతికంగా ఇవ్వలేదని, అందువల్ల బహుమతి ఇంకా పూర్తిగా అందలేదని తెలిపారు.
తన తల్లి విజయలక్ష్మి షేర్ల బదిలీ అక్రమమని, ఆమె తన కుమార్తెకు అనుకూలంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు.
Details
జగన్ ఆస్తుల పెరుగుదలపై షర్మిల ఆరోపణలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని, తండ్రి హయాంలో ఆస్తులు ఇద్దరికీ చెందతాయని వైఎస్ స్వయంగా చెప్పారని షర్మిల తెలిపారు.
కానీ ఆయన మరణం తర్వాత, జగన్ మొత్తం ఆస్తుల్ని కాజేయాలని చూసారని ఆరోపించారు.
కుటుంబ ఆస్తుల వివాదం చివరికి కోర్టులోకి వెళ్లింది. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో కొన్ని ఆస్తులు ఇప్పటికీ జప్తులో ఉన్నాయని షర్మిల గుర్తుచేశారు.