LOADING...
Jairam Ramesh: లడఖ్ ఆందోళనలో మాజీ సైనికుడి మృతి.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు
లడఖ్ ఆందోళనలో మాజీ సైనికుడి మృతి.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

Jairam Ramesh: లడఖ్ ఆందోళనలో మాజీ సైనికుడి మృతి.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

లడఖ్‌లో ఇటీవల జరిగిన నిరసనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ సైనికుడి మరణంపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ లడఖ్ కోసం ఆరవ షెడ్యూల్‌లో ప్రత్యేక హక్కులు ఇవ్వాలన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మాజీ సైనికుడిని ప్రభుత్వం సరిగా గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Details

కేంద్రం చూపిన తీరుపై బాధాకరం

ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి త్సేవాంగ్ థార్చిన్ అని, ఆయన సియాచిన్‌ హిమనదిలో సేవలందించారని చెప్పారు. కార్గిల్‌ యుద్ధంలో కూడా ధైర్యంగా పోరాడారని జైరం రమేష్ గుర్తుచేశారు. అంతేకాకుండా, థార్చిన్ తండ్రి కూడా భారత సైన్యంలో పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లడఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని శాంతియుతంగా నిరసన తెలిపిన వీరజవాను ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. దీనిని కేంద్రం చూసిన తీరు బాధాకరమని జైరం రమేష్ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.