LOADING...
ED: చత్తీస్‌గఢ్‌లో‌ మద్యం స్కామ్‌.. మాజీ సీఎం కుమారుడిపై ఈడీ చర్యలు
చత్తీస్‌గఢ్‌లో‌ మద్యం స్కామ్‌.. మాజీ సీఎం కుమారుడిపై ఈడీ చర్యలు

ED: చత్తీస్‌గఢ్‌లో‌ మద్యం స్కామ్‌.. మాజీ సీఎం కుమారుడిపై ఈడీ చర్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ను ఈడీ (ED) అరెస్టు చేసింది. దర్యాప్తులో, చైతన్య బఘేల్ రూ.1,000 కోట్ల విలువైన మద్యం సిండికేట్‌ను నడిపినట్లు గుర్తించారు. ఈ సిండికేట్ నిర్వహణకు, అప్పటి ఐఏఎస్ అధికారి అనిల్‌, వ్యాపారవేత్త అన్వర్ ధేబర్ సహకరించినట్లు ఈడీ ఆరోపించింది. సిండికేట్ ద్వారా సేకరించిన అన్ని అక్రమ నిధుల ఖాతాలు, పంపిణీ వ్యవహారాలను చైతన్య బఘేల్ తనకే చూసుకునేవాడని పేర్కొంది. ఆ నిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పార్టీ కార్యకలాపాలకు వినియోగించాడని ఈడీ తెలిపారు.

Details

త్వరలోనే మరికొంతమందిపై చర్యలు

మరి కొంతమంది రాజకీయ నేతలకు కూడా ఈ కుంభకోణంలో సంబంధం ఉండవచ్చని ఈడీ సూచించింది. త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్ ముఖ్యమంత్రిగా ఉన్న 2019-2022 కాలంలో, రాష్ట్రానికి రూ.2,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ, ఈడీ కేసు నమోదు చేసి, భూపేశ్ బఘేల్ నివాసంలో సోదాలు చేపట్టింది. చైతన్య బఘేల్ అధికారులు సమన్వయం చేయకపోవడంతో అరెస్టు చేయడం తప్పనిసరి అయింది.