Srisailam: తాగునీటి ఆందోళన.. శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు
వ్రాసిన వారు
Sirish Praharaju
May 14, 2026
08:59 am
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉంది. అయితే బుధవారం ఉదయానికి నీటిమట్టం 817.70 అడుగులకు పడిపోయింది. ప్రస్తుతం జలాశయంలో కేవలం 39.2025 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ విద్యుదుత్పత్తి అవసరాల పేరుతో జలాశయం నుంచి అధికంగా నీటిని వినియోగించినట్లు అధికారుల నివేదికల్లో వెల్లడైంది. దీంతో రాబోయే రోజుల్లో తాగునీటి పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.