LOADING...
Rain Alert: కోస్తాంధ్ర, రాయలసీమలో మరో 48 గంటలు వర్షాలు.. ప్రజలకు అప్రమత్త సూచనలు
కోస్తాంధ్ర, రాయలసీమలో మరో 48 గంటలు వర్షాలు.. ప్రజలకు అప్రమత్త సూచనలు

Rain Alert: కోస్తాంధ్ర, రాయలసీమలో మరో 48 గంటలు వర్షాలు.. ప్రజలకు అప్రమత్త సూచనలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదే ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌-నికోబార్‌ దీవుల ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement