BJP: ముస్లిం కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్.. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఒక నిర్దిష్ట మత సముదాయానికి అనుకూలంగా ఉందని మండిపడింది.
బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ను 'ఆధునిక ముస్లింలీగ్'గా అభివర్ణిస్తూ, ఇది బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ, కొన్ని పార్టీలు కేవలం ఓట్ల కోసమే మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.
Details
సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం
కర్ణాటక క్యాబినెట్, కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ (KTPP) చట్టంలో సవరణకు ఆమోదం తెలిపింది.
ఈ మార్పుతో ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4% రిజర్వేషన్ అమలు కానుంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన విధాన సభ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 7న రాష్ట్ర బడ్జెట్‌లో సీఎం సిద్ధరామయ్య, ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో 4 శాతం ముస్లింలకు కేటగిరి -2బి కింద రిజర్వ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Details
బీజేపీ నేతల విమర్శలు
ఈ రిజర్వేషన్‌పై బీజేపీ నేత అమిత్ మాల్వియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కర్ణాటక కాంగ్రెస్ మతపరమైన ప్రాధాన్యతనిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు.
కర్ణాటక ప్రభుత్వం అవినీతి, బుజ్జగింపు రాజకీయాలపై మాత్రమే దృష్టి పెడుతోందని మాల్వియా ఆరోపించారు.
భారత రాజ్యాంగం మతపరంగా ప్రభుత్వ ప్రయోజనాలను అమలు చేయడాన్ని అంగీకరించదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌ను 'న్యూ ముస్లిం లీగ్'గా అభివర్ణిస్తూ, ఈ నిర్ణయం మైనారిటీల ఓట్ల కోసం తీసుకున్న రాజకీయ ప్రయత్నమని మండిపడ్డారు.