LOADING...
Anand Sharma: విదేశాంగ శాఖ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రాజీనామా
విదేశాంగ శాఖ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రాజీనామా

Anand Sharma: విదేశాంగ శాఖ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హస్తం పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌ శర్మ, ఏఐసీసీ విదేశీ వ్యవహారాల విభాగ అధ్యక్ష పదవికి ఆదివారం తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన పంపిన లేఖలో ఒక ముఖ్య కారణాన్ని ప్రస్తావించారు. విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి, ప్రతిభ కలిగిన యువ నాయకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన రాజీనామా వెనుక మరో కారణం ఉందా? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

వివరాలు 

పది సంవత్సరాలుగా ఏఐసీసీ విదేశీ వ్యవహారాల విభాగానికి అధ్యక్షుడిగా ఆనంద్‌ 

ఆనంద్‌ శర్మ తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. అందులో పార్టీ ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతూ, "ఈ బాధ్యతను చేపట్టే అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి నా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ విభాగంలో మార్పులు చేసి, సమర్థులైన యువ నేతలకు అవకాశం ఇవ్వడం సమయోచితమని భావిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఆనంద్‌ శర్మ దాదాపు పది సంవత్సరాలుగా ఏఐసీసీ విదేశీ వ్యవహారాల విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే, పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన, సుమారు నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ వ్యవహారాలపై కాంగ్రెస్‌కు కీలక ప్రతినిధిగా ఉన్నారు. రాజీనామా చేసినప్పటికీ, ఆయన కాంగ్రెస్‌ సభ్యుడిగానే కొనసాగనున్నారు.

వివరాలు 

వాణిజ్య మంత్రిగా తొలి WTO ఒప్పందం  

రాజకీయ జీవితంలో అనేక ముఖ్యమైన సందర్భాల్లో ఆయన పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఇండో-అమెరికా అణు ఒప్పంద చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, తొలి భారత్‌-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం నిర్వహణలో ముందుండారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌ వైఖరిని విదేశాల్లో బలంగా వ్యక్తపరచేందుకు వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధుల బృందంలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్‌ స్పష్టమైన వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఉంచిన వారిలో ఆనంద్‌ శర్మ ఒకరు. వాణిజ్య మంత్రిగా ఉన్న సమయంలో, ఆయన తొలి WTO ఒప్పందం సహా అనేక సమగ్ర వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విదేశాంగ శాఖ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ రాజీనామా