తదుపరి వార్తా కథనం
Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం.. 25వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 14, 2025
01:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో నవీన్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుండి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్ తర్వాత రౌండ్, ఆయన ఆధిక్యం మరింత పెరుగుతూ, ఏ ఒక్క దశలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం సాధించలేకపోయారు. ఈ ఘన విజయం కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చింది, ఇక రేవంత్ రెడ్డి సర్కార్‌కు కూడా ప్రేరణగా నిలిచింది.