LOADING...
Manish Tewari: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ .. మనీశ్‌ తివారీ క్రిప్టిక్‌ పోస్టు
ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ .. మనీశ్‌ తివారీ క్రిప్టిక్‌ పోస్టు

Manish Tewari: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ .. మనీశ్‌ తివారీ క్రిప్టిక్‌ పోస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్‌పై మంగళవారం (జూలై 30) లోక్‌సభలో చర్చ జరగనుంది. అయితే ఈ కీలక చర్చలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు శశి థరూర్,మనీశ్ తివారీలను పార్టీలో నుంచి పక్కన పెట్టినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల మధ్య,మనీశ్ తివారీ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయ స్థాయిలో వివరణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శశి థరూర్,మనీశ్ తివారీ కూడా సభ్యులుగా పాల్గొన్నారు. అయితే పార్లమెంటులో జరుగబోయే చర్చలో తమను ఎందుకు పక్కన పెట్టారనే అంశంపై ఓ వార్తా సంస్థ ప్రచురించిన కథనాన్ని తివారీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

వివరాలు 

"మౌనవ్రతం… మౌనవ్రతం…"

ఈ పోస్టులో తివారీ,బాలీవుడ్ చిత్రం 'పూరబ్ ఔర్ పశ్చిమ్'లోని దేశభక్తి గీతంలోని కొన్ని లైన్లను జోడించారు. ఇది ఆయన భావోద్వేగాన్ని ప్రతిబింబించగా,"తాను భారత దేశ గౌరవం,సమృద్ధిని మాత్రమే కోరుకుంటానని" సూచించింది. అంతేకాకుండా,ఈ చర్చల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని తివారీ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని పార్టీకి చెందిన వర్గాలు ఓ మీడియా సంస్థకు వెల్లడించాయి. ఇక శశి థరూర్ విషయానికొస్తే..ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో ఆయన పాల్గొనాలనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది.అయితే ఆయన పార్టీలో చెప్పిన విధంగా మాత్రమే మాట్లాడాలని కోరగా,అందుకు ఆయన అంగీకరించలేదని సమాచారం. ఈఅంశంపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా,థరూర్"మౌనవ్రతం... మౌనవ్రతం..." అంటూ ప్రతిస్పందించడమే గాక, మరే ఇతర వ్యాఖ్యానానికీ అవకాశం ఇవ్వలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మనీశ్‌ తివారీ చేసిన ట్వీట్