LOADING...
Sivaraj Patel: మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత 
మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత

Sivaraj Patel: మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పటేల్‌ (91) కన్నుమూశారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఆయన కన్నుమూశారు. సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగి ఉన్నారు లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించడంతో పాటు, అనేక కీలక కేంద్ర మంత్రిత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు. శివరాజ్ పటేల్‌ రాజకీయ ప్రయాణం శివరాజ్ పటేల్‌ దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు. ఆయన కేంద్ర హోం మంత్రిగా పనిచేయడంతో పాటు, లోక్‌సభ స్పీకర్‌గా కూడా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడైన పటేల్ 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోంమంత్రిగా, 1991 నుండి 1996 వరకూ లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత

Advertisement