NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: సోనియా గాంధీపై వ్యాఖ్యలు.. అమిత్ షాపై కాంగ్రెస్ 'సభా హక్కుల ఉల్లంఘన నోటీసు''..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Congress: సోనియా గాంధీపై వ్యాఖ్యలు.. అమిత్ షాపై కాంగ్రెస్ 'సభా హక్కుల ఉల్లంఘన నోటీసు''..
    సోనియా గాంధీపై వ్యాఖ్యలు.. అమిత్ షాపై కాంగ్రెస్ 'సభా హక్కుల ఉల్లంఘన నోటీసు''..

    Congress: సోనియా గాంధీపై వ్యాఖ్యలు.. అమిత్ షాపై కాంగ్రెస్ 'సభా హక్కుల ఉల్లంఘన నోటీసు''..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ''నిందించే వ్యాఖ్యలు'' చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ''సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం'' ప్రవేశపెట్టింది.

    కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఈ నోటీసులను సభలో సమర్పించారు.

    రాజ్యసభలో అమిత్ షా, సోనియా గాంధీపై ఉద్దేశపూర్వకంగా నిరాధార ఆరోపణలు చేసి, ఆమె ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని జైరాం రమేష్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

    ప్రవర్తనా నియమావళిలోని 188వ నిబంధన ప్రకారం ప్రత్యేక హక్కుల నోటీసులు సమర్పించారు.

    వివరాలు 

    రాజ్యసభలో విపత్తు నిర్వహణ బిల్లు - 2024పై చర్చ

    ''హోం మంత్రి సోనియా గాంధీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా,ఆమె గురించి స్పష్టంగా ప్రస్తావించి ఆరోపణలు చేశారు.ఆమెపై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె గౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. అమిత్ షా చేసిన ప్రకటన పూర్తిగా అసత్యం, పరువు నష్టం కలిగించేవి'' అని లేఖలో వివరించారు.

    మార్చి 25న రాజ్యసభలో విపత్తు నిర్వహణ బిల్లు - 2024పై జరిగిన చర్చలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను జైరాం రమేష్ ప్రస్తావించారు.

    వివరాలు 

    అమిత్ షా సభను మోసగించారని విమర్శించిన జైరాం రమేష్

    ''ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిని కాంగ్రెస్ పాలనలో స్థాపించారు. PM-CARES నిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం ప్రారంభించింది. కాంగ్రెస్ పాలనలో దేశాన్ని ఒకే కుటుంబం నియంత్రించేది'' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

    నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌లో కీలక పాత్ర వహించేవారని సూచించారు.

    ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో, జైరాం రమేష్, అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేస్తూ, ఆయన సభను మోసగించారని విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    కాంగ్రెస్

    Manmohan singh: పాడె మోసిన రాహుల్ గాంధీ.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు మన్మోహన్ సింగ్
    Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం మన్మోహన్ సింగ్
    Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్ మన్మోహన్ సింగ్
    Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025