Page Loader
Himani Narwal: కాంగ్రెస్ నేత హిమానీ హత్య.. నిందితుడు అరెస్ట్, వెలుగులోకి సీసీటీవీ వీడియో!
కాంగ్రెస్ నేత హిమానీ హత్య.. నిందితుడు అరెస్ట్, వెలుగులోకి సీసీటీవీ వీడియో!

Himani Narwal: కాంగ్రెస్ నేత హిమానీ హత్య.. నిందితుడు అరెస్ట్, వెలుగులోకి సీసీటీవీ వీడియో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. హిమానీని తానే హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని అధికారులు వెల్లడించారు. తాజాగా, హిమానీ హత్యకు గురైన రోజు ఆమె నివాసం సమీపంలో సచిన్ సూట్‌కేసును తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

Details

ఇంట్లోనే హత్యకు గురైనట్లు నిర్ధారణ

హర్యానా రోహ్‌తక్ జిల్లాలోని సాంప్లా బస్టాండ్ సమీపంలో మార్చి 1న సూట్‌కేసులో హిమానీ నర్వాల్ మృతదేహం బయటపడటంతో కలకలం రేగింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫిబ్రవరి 28న రాత్రి 10 గంటల సమయంలో హిమానీ నివాసం సమీపంలో సచిన్ సంచరిస్తున్నట్లు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం అదే సూట్‌కేసులో ఆమె మృతదేహం లభించిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా హిమానీ తన ఇంట్లోనే హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సచిన్ పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం, హిమానీతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, ఆమె తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతో కోపంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అదనంగా సచిన్‌కు ఇప్పటికే వివాహమైందని, హిమానీతో స్నేహితులుగా ఉండేవారని పోలీసులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీసీ టీవీ వీడియో ఫుటేజ్