తదుపరి వార్తా కథనం

Congress leader: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 27, 2025
04:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
గుంతకల్లు పట్టణ శివారులో ఎమ్మెలార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.
ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు నుండి చిప్పగిరి వెళ్ళిపోతున్న లక్ష్మీనారాయణని గుర్తుతెలియని వ్యక్తులు టిప్పర్ వాహనంతో ఢీకొట్టారు.
ఈ దాడిలో కారులో చిక్కుకున్న ఆయనపై కత్తులతో దాడి చేసి తీవ్ర గాయపరిచారు. ప్రతికూల పరిస్థితుల్లో లక్ష్మీనారాయణను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించినా, ప్రయోజనం లేకుండా ఆస్పత్రిలోనే ఆయన ప్రాణాలు విడిచారు.
ఈ దారుణ హత్య వెనుక ఎవరున్నారో అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.