
Shashi Tharoor: పార్టీ కార్యక్రమాలకు శశిథరూర్ కి నో ఎంట్రీ.. మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శశిథరూర్ తీరుపై ఇప్పుడు ఆయన సొంత పార్టీలో, అదీ తన సొంత రాష్ట్రమైన కేరళలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ నాయకత్వానికి అనుకూలంగా కాకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఆయనపై విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కే మురళీధరన్ ఆయనపై ఘాటుగా స్పందించారు.
Details
పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు : కే మురళీధరన్
దేశ భద్రత అంశంపై శశిథరూర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తన వైఖరిని మార్చుకునే వరకు తిరువనంతపురంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించేది లేదని మురళీధరన్ స్పష్టం చేశారు. అయన మాతో కలిసి లేరు. కాబట్టి ఆయనను బహిష్కరించే ప్రసక్తే లేదు. కానీ పార్టీ కార్యక్రమాల్లోనికి పిలవబోమని స్పష్టం చేస్తున్నాం. ఆయనపై ఏ చర్యలు తీసుకోవాలో పార్టీ హైకమాండ్ నిర్ణయించాలని మీడియాతో మాట్లాడారు.
Details
పాత అంశాలు మళ్లీ తెరపైకి.. థరూర్‌పై మురళీ ధ్వజం
ఇది మొట్టమొదటిసారి కాదు. శశిథరూర్ తీరుపై మురళీధరన్ గతంలోనూ పలుమార్లు మండిపడ్డారు. ఎమర్జెన్సీ దశకాలపై శశిథరూర్ రాసిన వ్యాసం తీవ్ర దుమారాన్ని రేపినప్పుడు కూడా మురళీధరన్ విరుచుకుపడ్డారు. థరూర్‌కు కాంగ్రెస్‌లో ఏవైనా ఆంక్షలు ఉన్నట్లు అనిపిస్తే, ఆయన ఓ స్పష్టమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని, క్లారిటీ ఇవ్వాలని సూచించారు.
Details
థరూర్ ఏ పార్టీకి చెందినవారో చెప్పాలి
ఇటీవలి కాలంలో కేరళలో జరిగిన ఓ సర్వేలో యూడీఎఫ్ తరఫున సీఎంపై అభ్యర్థిగా శశిథరూర్‌కే ప్రజాభీష్టం ఉందని తేలినప్పుడు కూడా మురళీ ధ్వజమెత్తారు. 'అయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలని విరుచుకుపడ్డారు. పార్టీ ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తానంటూ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మురళీ అసంతృప్తిగా ఉన్నారు.
Details
బీజేపీలోకి చేరనన్న శశిథరూర్, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్న స్పష్టత
ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా శశిథరూర్‌కు కాంగ్రెస్ అధిష్టానం మధ్య ఒప్పందం కుదరడం లేదన్న విషయం విదితమే. ముఖ్యంగా ప్రధాని మోదీపై సానుకూల వ్యాఖ్యలతో ఆయన తన పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ, తాను బీజేపీలో చేరబోనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేస్తూ వస్తున్నారు. తీర్మానం పార్టీ అధిష్టానానిదే శశిథరూర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది పూర్తిగా పార్టీ హైకమాండ్ పరిధిలోకి వస్తుందని కే మురళీధరన్ స్పష్టం చేసినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు శశిథరూర్ పార్టీ దౌత్య సంబంధాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయని స్పష్టమవుతోంది.